-రవాణాలో ఒక ఆవు మృతి

చింతలమానేపల్లి మండలం గూడెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుండి ఆవులను రవాణా చేస్తున్న షకీల్ (నివాసం: చంద్రయానగుట్ట) మరియు డ్రైవర్ ఇర్ఫాన్‌లను, ఆసాద్ ను పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌ను స్టేషన్‌కు తరలించి తనిఖీ చేసినప్పుడు మొత్తం 27 ఆవులు ఉండగా, అందులో ఒక ఆవు మృతదేహంగా కనపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్ ఐ నరేష్ ప్రారంభించారు.