-ఉద్యోగులందరూ నిరసన కార్యక్రమాలకు సిద్ధం

-టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, సెక్రటరీ గడియారం శ్రీహరి, వనజ రెడ్డి

మంచిర్యాల ప్రత్యక్షత :-తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల కు పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఉద్యోగుల సమస్యలను పరిష్కారం మార్గం చూపలేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు కాలయాపన చేస్తుందని మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ (తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఆగష్టు 15 లోపు పరిష్కరించాలని అన్నారు. అనంతరం సమస్యల పరిష్కారము చూపకపోతే మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర కార్యవర్గానికి అందరూ అందుబాటులో ఉండాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ వనజ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ భూముల రామ్మోహన్ పలు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి