
హైదరాబాద్ ప్రత్యక్షత:-మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గడియారం ఐశ్వర్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. ప్రస్తుతం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య, రైతులు విత్తన దశ నుంచి మార్కెటింగ్ వరకు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులను ప్రోత్సహించాల్సిన విధానాలపై చేసిన ఉపన్యాసానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.10 వేల ప్రైజ్మనీ అందజేశారు.

