
మంచిర్యాల ప్రత్యక్షత:-అనారోగ్యంతో కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో ఎన్ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందుతున్న మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అక్కల స్వప్నను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారెం జగదీశ్వర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఎన్ఈహెచ్ఎస్ సేవల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. స్వప్న మాట్లాడుతూ మెడికవర్ ఆస్పత్రిలో ఎన్ఈహెచ్ఎస్ సేవలు సమర్థవంతంగా అందుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగి స్వప్నను పరామర్శించిన కేంద్ర సంఘం అధ్యక్షుడు మారెం జగదీశ్వర్‌కు జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులు కరీంనగర్‌లోని మెడికవర్, రేనే ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఎన్ఈహెచ్ఎస్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

