
మంచిర్యాల ప్రత్యక్షత:-పెండింగ్లో ఉన్న రెండు డీఏలను విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇది ముఖ్యమైన ముందడుగు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, టీజీఈజేఏసీ నాయకత్వానికి జిల్లా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన డీఏలు, పీఆర్సీ అమలు, 51 శాతం ఫిట్మెంట్తో నూతన వేతన స్కేళ్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

