హోమ్టాప్ న్యూస్ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీలు ఇవ్వడం పట్ల టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దసరాకు రెండు డీఏలు, సంక్రాంతికి మరో డీఏ విడుదల చేస్తామని, ఈ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక తెప్పించి మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి తెలిపారు. సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చిందన్నారు. టీజీఈజేఏసీ జిల్లా కార్యదర్శి జనరల్ వనజ రెడ్డి, టీఎన్జీవోస్ నాయకుడు పొన్న మల్లయ్య ప్రభుత్వ స్పందనపై హర్షం వ్యక్తం చేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని అభినందించారు. భవిష్యత్‌లోనూ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this