-రూ.20,116 లకు దక్కించుకున్న అనూహ్య-అనురాగ్ దంపతులు

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాట ఘనంగా జరిగింది.ఈ వేలంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు గడియారం పల్లవి-శ్రీహరి దంపతుల కుమార్తె, అల్లుడు అనూహ్య-అనురాగ్ పుణ్య దంపతులు రూ.20,116/- లతో అత్యధిక పాట పాడి స్వామి వారి లడ్డును దక్కించుకున్నారు.ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలిపి, సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి నాగేశ్వర్, హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు సైండ్ల మొండయ్య, నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సతీష్ కుమార్, తిరుపతి రెడ్డి, సునీత, టి.తిరుపతి, జె.రాంకుమార్, ప్రసాద్, ఉష, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.

