
మంచిర్యాల ప్రత్యక్షత:-టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ సిబ్బంది మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్యాలయంలోని సిబ్బంది మూకుమ్మడిగా సామూహిక సెలవులు పెట్టారు.టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిబ్బంది నిర్ణయించారు.ఈ సందర్భంగా మంచిర్యాల ఆర్డీవో జి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపిన ఆర్డీవో జి. శ్రీనివాస్‌కు టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు ఐక్యంగా తరలిరావాలని టీజీఈజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

