హోమ్టాప్ న్యూస్చలో హైదరాబాద్ కు అనుమతి కోరుతూ కలెక్టర్ కు వినతి

చలో హైదరాబాద్ కు అనుమతి కోరుతూ కలెక్టర్ కు వినతి

Published on

spot_img

-మంచిర్యాల నుంచి 10 వేల మందికి తగ్గకుండా తరలిరావాలి

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి కోరుతూ వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యను కూడా కలిసి కార్యక్రమ వివరాలను వివరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం మంచిర్యాల జిల్లా నుంచి 10 వేల మందికి తగ్గకుండా హైదరాబాద్‌కు తరలివచ్చి చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, ఉప ప్రధాన కార్యదర్శులు సుధాకర్, బొడ్డు శ్రావణ్‌కుమార్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆవరణలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, మహిళా కమిటీ ఆధ్వర్యంలో...

టీఎన్జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు...

ఉద్యోగుల వైద్య సేవలపై పరిశీలన

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:-మంచిర్యాలలోని వసుధ ఆసుపత్రి, వైష్ణవి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌...

ఎన్‌ఈహెచ్‌ఎస్‌ అమలుపై పరిశీలన

మంచిర్యాల ప్రత్యక్షత:- పట్టణంలోని తిరుపతి ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (NEHS) పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర...

More like this