-జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి
-టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి,ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో, అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని కోరారు. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం చలో హైదరాబాద్ గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా ఐక్య కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఉద్యోగి ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు.ఈ సమావేశాల్లో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి కిషన్, గణపతి, రాజేశ్వరి, జిల్లా ఐక్య కార్యాచరణ సమితి సహ చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, ఉప ప్రధాన కార్యదర్శులు అత్తే సుధాకర్, బొడ్డు శ్రావణ్‌కుమార్, ఉపాధ్యక్షులు సూరినేని గంగాధర్, నాగుల గోపాల్, కార్యదర్శులు తంగళ్లపల్లి తిరుపతి, సత్యనారాయణ, అజయ్ ప్రశాంత్, ప్రకాష్, అభిషేక్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు, ప్రతినిధులు, జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

