-కాంగ్రెస్ హామీలు అమలులో పూర్తిగా విఫలం
-వార్డులో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు
-బిజెపి అభ్యర్థి బంగారి అర్చన గెలుపుతో అభివృద్ధి ప్రారంభం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బంగారి అర్చన-ప్రసాద్ అన్నారు. సోమవారం చివరి రోజు ఇంటింటి ప్రచారంలో అందుగుల శ్రీనివాస్ పాల్గొని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి బంగారి అర్చన ప్రసాద్ పేద ప్రజల అభివృద్ధి కోరికై దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని కాలనీలోని అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలనుకుంటే బిజెపి పార్టీతోనే సాధ్యమని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తనవంతు నిస్వార్థ సేవలు అందిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తి విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రజలకు అందజేసి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తెలియజేశారు. 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. బిజెపి పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే కాలనీలో అభివృద్ధి పనులకు కృషి చేస్తానని బిజెపి పార్టీ అభ్యర్థి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.