హోమ్ టాప్ న్యూస్ సిపిఐ కౌన్సిలర్లకు ఘన సన్మానం

సిపిఐ కౌన్సిలర్లకు ఘన సన్మానం

0

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సిపిఐ పార్టీ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ను అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మద్దెల శంకర్, మీనుగు ముని లను ఆదివారం పట్టణంలో సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసీరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు హాజరై, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధి, పారదర్శక పాలన, పేదల సంక్షేమం, మౌలిక వసతులు కోసం కృషి చేయాలన్నారు. సిపిఐ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి, పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు లింగం రవి, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, నాయకులు పేరక సంపత్, కాదండి సాంబయ్య, మామిడి గోపి, ఎగ్గుడ మొండి, దేవి పోచన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version