హోమ్ టాప్ న్యూస్ రామకృష్ణాపూర్ నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

రామకృష్ణాపూర్ నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

0

-ప్రెస్ క్లబ్ ఏ ఇతర క్లబ్బులో విలీనం కాలేదు:మిట్టపల్లి సంతోష్

ప్రత్యక్షత:-మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 332/22 గల ఎన్నికలు మంగళవారం స్థానిక ఠాగూర్ స్టేడియం లో ఏకగ్రీవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేల్పుల కిరణ్ కుమార్, కోశాధికారి కూరపాటి శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడు బద్రి సంతోష్ కుమార్, జాయింట్ కార్యదర్శి గంజి సతీష్ ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ బాధ్యతలు చేపట్టిన వారిని ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ,జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం వార్తలు రాస్తూ ప్రజల నమ్మకానికి నిదర్శనం నిలుస్తామని అన్నారు.తమపై నమ్మకంతో ఈ పదవి కల్పించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ఇతర క్లబ్ లోనూ విలీనం కాలేదు. భవిష్యత్తులో ఈ క్లబ్ ఎవరితోనూ విలీనం కాదని స్పష్టం చేశారు. ఈ క్లబ్ స్వతంత్రంగా ప్రజల సమస్యలపై పనిచేస్తుందిని అన్నారు.క్లబ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా, విలీనం గురించి తప్పుడు వార్తలు లేదా దుష్ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోముని అన్నారు. ప్రెస్ క్లబ్ ల పేరిట విహారయాత్రలకు వెళ్తున్నామని, అందుకు సహకరించాలని పట్టణంలో తిరుగుతున్న వ్యక్తులకు రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ కు ఎటువంటి సంబంధం లేదు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పట్టణ ప్రజలను, రాజకీయ నాయకులను అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో క్లబ్బు సభ్యులు పిల్లి రవి కిరణ్, ఎరుకల బుచ్చిబాబు, ఎర్రవెల్లి శ్రీనివాస్,మారపల్లి సాయి, డోలకల సంతోష్ లు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version