హోమ్ టాప్ న్యూస్ మేయర్ ను సన్మానించిన టీఎన్జీవో నాయకులు

మేయర్ ను సన్మానించిన టీఎన్జీవో నాయకులు

0

-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేషన్ తొలి మేయర్ ధర్ని మధుకర్ ఎన్నికైన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా టీఎన్జీవో నాయకులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల పలు సమస్యల పైన చర్చించారు. ఉద్యోగులకు సహాయ సహకారాలు అందచేయాలని కోరారు. మేయర్ మధుకర్ మాట్లాడుతూ..మంచిర్యాల కార్పొరేషన్ ను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగులకు సమస్యలున్న సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్,తిరుపతి,అంజయ్య, కేజియా రాణి, పద్మలత,నరేందర్, శ్రీధర్ రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్ లక్షటిపేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్,బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్,కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్,కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version