-క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు
-నామినేషన్లు దాఖలు చేసిన ఎస్ వెంకట స్వామి, సత్యనారాయణ లు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలే ఊపిరిగా సిపిఎం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సిపిఎం పార్టీ నాయకులు సాంబార్ వెంకటస్వామి, లింగాల సత్యనారాయణ లు తెలిపారు. జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డ్ కౌన్సిలర్ గా సిపిఎం పార్టీ అభ్యర్థిగా సాంబార్ వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేయగా, 14వ వార్డు కౌన్సిలర్ గా సిపిఎం పార్టీ అభ్యర్థిగా లింగాల సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు నిర్వహిస్తున్నామని, నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ఎన్నికల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ నుండి 11వ వార్డ్, 14వ వార్డు కౌన్సిలర్లుగా పోటీలో నిలిచామని తెలిపారు. ప్రజలందరూ తమను ఆదరించి, సిపిఎం పార్టీ సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు. కౌన్సిలర్ లుగా తమను గెలిపిస్తే ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా శ్రేయస్సుకు పాటుపడతామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందేలా కృషి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు.