హోమ్ టాప్ న్యూస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో టీఎన్జీవో నాయకులు

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో టీఎన్జీవో నాయకులు

0

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత జిల్లా కార్యాలయలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బాగంగా మంచిర్యాల జిల్లా ఐడిఓసి లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భాస్కర్,అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) పి. చంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి,రామ్ కుమార్,కార్యవర్గ సభ్యులు కుమార్ గంగారం,తదితరులు పాల్గొన్నారు. తదుపరి మంచిర్యాల జిల్లా టి ఏ జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలనలో బాగంగా ప్రభుత్వం తెచ్చే ప్రతి పతకం ను ప్రజలకు చేరవేయడానికి నిరంతరం టీఎన్జీవో ఉద్యోగులు ముందు ఉంటారని తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా తెలంగాణలోని ప్రతి నాన్ గెజిటెడ్ ఉద్యోగి టీఎన్జీవో యూనియన్ నిరంతరం కష్టపడి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version