
6తులాల బంగారం,6వేల నగదు అపహరణ
జిల్లా కేంద్రం లోని నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సంజీవ్‌రెడ్డి కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి నాయనమ్మ ఇటీవల మృతి చెందడంతో హోమం చేయించేందుకు గురువారం ఆలయానికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో వస్తువులను చిందర వందరగా చేసి బీరువా తెరచి ఉండంతో దొంగలు పడినట్లు గుర్తించారు. ఆరు తులాల బంగారం, రూ. 6వేల నగదు పోయినట్లు బాధితులు తెలిపారు. అనంతరం నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విషయం తెలుసుకొన్న ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నమన్నారు.