హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరణ

0

-మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల ప్రత్యక్షత:- టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన నివాసంలో జిల్లా హౌసింగ్ సొసైటీ క్యాలెండర్ ఎమ్మెల్యే చేతిలో మీదుగా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు తమవంత ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ క్యాలెండర్ ను ఆవిష్కరించినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి తమ వంతు సహాయ సహకారాలు ఎమ్మెల్యే అందజేయాలని జిల్లా కమిటీ తరఫున కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో హౌసింగ్ సొసైటీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి హబీబ్ హుస్సేన్,ఉపాధ్యక్షులు మొండయ్య, సభ్యులు భూముల రామ్మోహన్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు,ప్రసాద్,నాగుల గోపాల్, కళావతి, అండాలు, వసుమతి,సంపత్, చంద్రశేఖర్ రెడ్డి,రవి కిషోర్, శ్రీ లక్ష్మీ నారాయణ, రమేష్, శ్రీదర్,రాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version