
మంచిర్యాల ప్రత్యక్షత:-ఇరిగేషన్ శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి ప్రభాకర్ ను బుధవారం టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన క్రాంతి కిరణ్ ను సైతం మర్యాదపుర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ నుండి పదోన్నతిపై సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందిన తిరుపతి ని టీఎన్జీవో ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో టీఎన్జీవో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు తిరుపతి, రామ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోసిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు యూసఫ్, చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.