హోమ్ టాప్ న్యూస్ జిల్లా కలెక్టర్ ని సన్మానించిన టీఎన్జీవో నాయకులు

జిల్లా కలెక్టర్ ని సన్మానించిన టీఎన్జీవో నాయకులు

0

-రాబోయే ఎన్నికల్లో టీఎన్జీవో ఉద్యోగులు కృషి చేస్తాం: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా సమీకృత కార్యాలయం సముదాయం లో గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో విజయవంతమైన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో టీఎన్జీవో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు.అలాగే టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా టిఎన్జీవో సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని అన్నారు.

అదేవిధంగా మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ ఆయన సందర్భంగా ఉద్యోగులకు 17 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కలెక్టర్ ని కోరారు.కలెక్టరేట్ కార్యాలయ రెవెన్యూ ఉద్యోగులు 50 మంది టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, నరేందర్,ఆర్గనైజ్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, ప్రచార కార్యదర్శి యూసుఫ్, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల జిల్లా యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,సభ్యులు అజయ్, విజయ, శ్రీనివాసు, రజలింగు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version