హోమ్ టాప్ న్యూస్ జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

0

హైదరాబాద్ ప్రత్యక్షత:-తెలుగు సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ, తెలంగాణ సంస్కృతి సాహిత బుక్ ఆఫ్ రికార్డ్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మాచవరం గౌరీశంకర్, సభ్యుడు బట్టు శ్రీనివాస్ రావు లు సోమవారం ప్రకటనలో తెలిపారు. సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషిచేసిన వారికి జాతీయ నవ స్పూర్తి, నవ కీర్తి, మహానంది, స్వర్ణనంది, స్వర్ణ కంకణం, ఐరావతం, కామదేనువు, మయూరి, లైఫ్ టైం అచీవ్మెంట్, లెజెండరీ పురస్కారాలతో సత్కరించి, వారి సేవలను అభినందిస్తూ, వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అర్చకులు, జర్నలిస్టులు సామాజిక సేవకులు, ఆధ్యాత్మికం, రంజు వావిద్యం, సాహిత్యం, రచన, కవులు, కళాకారులు, సంగీతం, నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, విద్య, వైద్యం, ఇంద్రజాలం, ముఖాభినయం, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, రంగస్థల కళాకారులు, జ్యోతిష్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాస్తు, యోగ, డోలక్ హార్మోనియం, భజన కళా సామాజిక సేవ, క్రీడలు, షార్ట్ ఫిలిం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు ఈ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 12, 2026 తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏప్రిల్ 19, 2026న నిర్వహించు కార్యక్రమంలో వారిని జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9985275385 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version