హోమ్ టాప్ న్యూస్ చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు

చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు

0

-కేసు వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్:పర్శ రమేష్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ శ్రీనివాస నగర్ కి చెందిన నల్లాల రాయమల్లక్క అనే మహిళ మే 25న మధ్యాహ్న సమయంలో నిద్రిస్తున్న వేళ గుర్తుతెలియని దొంగ రామమల్లక్క మెడలో పుస్తెలతాడు దొంగలించి పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణ ఎస్సై శ్రీధర్ పోలీస్ సిబ్బందిని రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను వెతకగా పోలీసుల సమాచారం ప్రకారం చైన్ స్నాచింగ్ చేసిన దొంగలను గజ్జి శ్యామ్, గజ్జి రమ లుగా గుర్తించి నిందితులు సింగరేణి ఏరియా హాస్పిటల్ ఆటో స్టాండ్ వద్ద దొంగ సొమ్మును అమ్మడానికి మంచిర్యాలకు వెళ్తున్న సమయంలో పట్టణ ఎస్సై శ్రీధర్ దొంగలను పట్టుకొని వారి వద్ద ఉన్న దొంగ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస నగర్ లో నివసించే నిందితులు గజ్జి శ్యామ్,గజ్జి రమ లు ఆర్థిక ఇబ్బందులు, జల్సా అలవాట్లకు దొంగలుగా మారారని పోలీసులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి అరెస్టు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ తెలిపారు. ఒక్కరోజులో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన ఎస్సై శ్రీధర్ పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ రివార్డు అందజేశారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version