-శ్రీ హర్ష జూనియర్ కళాశాల చైర్మన్ పల్లె భూమేష్

మంచిర్యాల ప్రత్యక్షత:-శ్రీ హర్ష జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించి, చక్కటి భవిష్యత్తుతో వెళ్లాలని జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ ఆకాంక్షించారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని కృతిక ఫంక్షన్ హాల్ లో వీడ్కోలు పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా,ఆనందంగా వేడుకల్లో పాలుపంచుకున్నారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆటపాటలతో సరదాగా గడుపుతూ, కళాశాలలో గడిపిన తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ మాట్లాడుతూ, పిల్లలు దిగ్విజయంగా పరీక్షలు పూర్తిచేసుకొని వీడ్కోలు పార్టీ నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక ఆశయంతో చదివి, అనుకున్న ఫలితాలు అందుకొని, పది మందికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పోటు మనోహర్ రెడ్డి, తనుగుల శ్రావణ్, కళాశాల ప్రిన్సిపల్ లావణ్య, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.