హోమ్ టాప్ న్యూస్ ఆదర్శ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఆదర్శ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

0

-టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ రమా దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, టీఎన్జీవో జిల్లా నాయకులు ఆ ఆదర్శ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. మారం జగదీశ్వర్ రమా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రేమ,గౌరవం పరస్పర అవగాహనతో సాగుతున్న వారి జీవన ప్రయాణం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రత్యేక రోజు వారి బంధం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. రాబోయే వివాహ వార్షికోత్సవాలు మరింత ఆనందం,చిరునవ్వులు, స్వచ్ఛమైన ప్రేమతో నిండాలని కలిసి గడిపే ప్రతి క్షణం మధుర జ్ఞాపకంగా మారాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరి సురేష్ బాబు, టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మేనేని సందీప్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version