హోమ్ టాప్ న్యూస్ అదనపు కలెక్టర్ కు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

అదనపు కలెక్టర్ కు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

0

-జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య ను, జిల్లా పశుసంవర్ధక అధికారి శంకర్ లకు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వారి కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య మాట్లాడుతూ..జిల్లా లోని రెవెన్యూ ఉద్యోగులందరూ నిరంతరాయంగా కష్టపడి భూభారతి ఇతర రెవెన్యూ పథకాల అమలుపరచడంలో రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆయన సూచించారు.అనంతరం జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం లోనే మంచిర్యాల జిల్లా భూభారతి ఇతర రెవెన్యూ పథకాలలో మొదటి స్థానంలో ఉండడానికి ఉద్యోగులు అందరం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి టీఎన్జీవో నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version